గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ బలోపేతం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ బలోపేతం

Nov 20 2026 1:07 AM | Updated on Nov 20 2026 1:07 AM

చింతలమానెపల్లి: మౌలిక సదుపాయాలు విస్తరిస్తూ గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని టీజీ ఎన్‌పీడీసీఎల్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ మోహన్‌రావు, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ టి.మధుసూదన్‌ అన్నారు. మండలంలోని గూడెం గ్రామంలో నూతనంగా నిర్మాణం పూర్తయిన సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ సరఫరాను గురువారం సాంకేతికంగా ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కౌటాల 132 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి 33 కేవీ బెజ్జూర్‌ ఫీడర్‌కు అనుసంధానించి నిర్మించిన గూడెం సబ్‌స్టేషన్‌ అందుబాటులో కి రావడంతో సమస్యలు తొలగిపోతాయని తెలిపా రు. స్థానికంగా పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా సరఫరా సామర్థ్యం మెరుగుపడడంతోపాటు లోడ్‌ తగ్గుతుందన్నారు. గూడెం సమీప గ్రామాలకు గృహ, వాణిజ్య, విద్యుత్‌ అవసరాలకు మెరుగైన విద్యుత్‌ సేవలను అందించగలమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌ఈ ఉత్తమ్‌ జాడె, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

160 కేవీఏ మొబైల్‌ టీటీఆర్‌ ట్రాలీ ప్రారంభం

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో ఇకపై డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌(డీటీఆర్‌) కాలిపోయినా, విఫలమైనా తక్షణమే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు వీలుగా 160 కేవీఏ సామర్థ్యం గల మొబైల్‌ డీడీఆర్‌ ట్రాలీని టీజీఎన్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ ఆపరేషన్స్‌ టి.మధుసూదన్‌, డైరెక్టర్‌ ప్రాజెక్ట్స్‌ మోహన్‌రావు గురువారం డివిజనల్‌ కార్యాలయంలో ప్రారంభించారు. వారు మాట్లాడుతూ కాలనీల్లో డీటీఆర్‌ విఫలమైతే ఈ ట్రాలీ డీటీఆర్‌తో అక్కడికి వెళ్లి తాత్కాలికంగా కనెక్షన్‌ ఇచ్చి కరెంట్‌ను పునరుద్ధరిస్తారని తెలిపారు. తర్వాత ఆ ప్రాంతంలో నెమ్మదిగా శాశ్వత ట్రాన్స్‌ఫార్మర్‌ను బిగిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీఎం ప్రాజెక్ట్స్‌ ప్రభావతి, ఎస్‌ఈ ఉత్తమ్‌ జాడె, డీఈలు నాగరాజు, వీరేశ్‌, ఈఈ శ్రీనివాస్‌, ఏ డీఈ ఇర్ఫాన్‌, ఏఈ కమలాకర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement