ఇదేంది.. సారూ! | - | Sakshi
Sakshi News home page

ఇదేంది.. సారూ!

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

వివాదాస్పదంగా మారుతున్న కొందరు టీచర్ల తీరు మద్యం తాగి విధులకు హాజరు ఇటీవల ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్‌ రెగ్యులర్‌ ఎంఈవోలు లేక కొరవడుతున్న పర్యవేక్షణ

తిర్యాణి మండలంలోని గంభీరావుపేట పీఎంశ్రీ ఎంపీయూపీఎస్‌ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌ కొన్ని రోజులుగా మద్యం తాగి విధులకు వస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 3న ఏకంగా పాఠశాలకే మద్యం తెచ్చుకుని తాగడాన్ని విద్యార్థులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడిపై ఎంఈవో అంజయ్యకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కలెక్టర్‌ కె.హరిత సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

బెజ్జూర్‌ మండలంలోని కుంటలమానెపెల్లి గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల(టీడబ్ల్యూపీఎస్‌)లో పనిచేస్తున్న సంతోష్‌ అనే ఉపాధ్యాయుడు విధులకు సక్రమంగా హాజరుకావడం లేదు. పాఠశాలకు మద్యం తాగి వస్తున్నట్లు అందిన ఫిర్యాదుల మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపారు. సదరు ఉపాధ్యాయుడిని ఈ నెల 11న డీటీడీవో జాదవ్‌ అంబాజీ సస్పెండ్‌ చేశారు.

తిర్యాణి: భావి భారత పౌరులను ఉన్నతంగా తీర్చిదిద్దే దేవాలయం తరగతి గది. అలాంటి చోట విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గం వైపు నడిపించాల్సిన గురువులే తమ బాధ్యత విస్మరిస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తికే తలవంపులు తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల తిర్యాణి మండలంలో ఓ ప్రధానోపాధ్యాయుడు ఏకంగా పాఠశాలకే మద్యం తెచ్చుకుని సేవించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. బెజ్జూర్‌ మండలంలోనూ ఓ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు తరచూ మద్యం తాగుతున్నట్లు ఆరోపణలు రావడంతో సస్పెండ్‌ అయ్యారు. ఇదే మండలంలోని సలుగుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం విధులకు సంబంధించిన సమావేశం నుంచి ముందుగానే వెళ్లిపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇలాంటి కొంతమంది గురువుల ప్రవర్తన వివాదాస్పదమవుతోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

విద్యార్థులపై ప్రభావం

జిల్లాలో 1,204 వివిధ యాజమాన్యాల కింద పాఠశాలలు కొనసాగుతుండగా, అందులో 5,160 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్నారులు విద్యార్థి దశలో తమ చుట్టూ జరిగే విషయాలను గమనిస్తూ మంచిచెడులు గ్రహిస్తుంటారు. మనిషి జీవితంలో విద్యార్థి దశ ఎంతో కీలకమైనదిగా భావిస్తుంటాం. అలాంటి సమయంలో తరగతికి వచ్చిన ఉపాధ్యాయులు మద్యం సేవించి రావడమే కాకుండా, మరికొన్ని సందర్భాల్లో పాఠశాలల్లోనే మద్యం తాగడం వారిపై తీవ్రమైన దుష్ప్రభావం పడుతుంది. ఉపాధ్యాయుడు మత్తులో ఉంటే బోధన సైతం చేయలేని పరిస్థితుల్లో విద్యార్థులు నాణ్యమైన విద్యను కోల్పోయే ప్రమాదం ఉంది.

గంభీరావుపేట పాఠశాలలో దొరికిన మద్యం బాటిళ్లు

ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లు

పాఠశాలలు సంఖ్య ఉపాధ్యాయులు

ప్రాథమిక 840 1,386

ప్రాథమికోన్నత 175 1,053

ఉన్నత 138 1,087

హయ్యర్‌

సెకండరీ స్కూల్స్‌ 51 914

మొత్తం 1,204 5,160

గతేడాది సెప్టెంబర్‌లో జైనూర్‌ మండలంలోని సుకుడ్‌పల్లి టీడబ్ల్యూపీఎస్‌ పాఠశాల ఉపాధ్యాయుడు తరగతి గది లోనే మద్యం తాగి నిద్రించాడు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేశారు... ఇవి వెలు గులోకి వచ్చిన ఘటనలు కాగా, బయటికి రాని మరెన్నో ఇలాంటి ఘటనలు విద్యాశాఖకు మచ్చగా మారుతున్నాయి.

పర్యవేక్షణ ఎక్కడా..?

క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు సక్రమంగా విధులను నిర్వహిస్తున్నారా లేదా అనేదానిపై పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మండల విద్యాధికారులు పాఠశాలలు, ఉపాధ్యాయుల పనితీరును నిత్యం గమనిస్తూ ఉండాలి. కానీ జిల్లాలోని 15 మండలాల్లో ఒక్కరూ కూడా రెగ్యులర్‌ ఎంఈవోలు లేకపోవడంతో పీజీ హెచ్‌ఎంలకు అదనపు బాధ్యతలు కేటాయించారు. దీంతో పీజీ హెచ్‌ఎంలు ఒకవైపు పాఠశాల బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు ఎంఈవోగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఫలితంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement