ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సమస్యలు పరిష్కరించకుంటే ఈ నెల 28 నుంచి సమ్మెకు సిద్ధమని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి దివాకర్‌గౌడ్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఎదుట గురువారం కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం ఆర్‌ఎంవో డాక్టర్ తిరుమలేశ్‌కు వినతిపత్రం అందించారు. కార్మికులకు నెలకు రూ.26వేల వేతనం, బోనస్, చట్ట ప్రకారం సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి, సిబ్బంది గంగాధర్, నీల, మాల తి, పద్మ, ప్రమీల, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


