అర్హులందరికీ చేయూత పింఛన్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులందరికీ చేయూత పింఛన్లు

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లాలోని అర్హులందరికీ చేయూత పింఛన్లు మంజూరు చేస్తామని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మున్సిపల్‌ చైర్మన్‌ మెంగ్రె ఆకాశ్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అనిల్‌, ఏఎంసీ చైర్మన్‌ ఇరుకుల్ల మంగతో కలిసి ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ, మండలంలోని లబ్ధిదారులకు చేయూత పింఛన్‌ ప్రొసీడింగ్స్‌ అందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చేయూత పింఛన్ల కోసం 9,466 దరఖాస్తులు రాగా, 8,540 మంది అర్హులుగా గుర్తించామని, మిగతా దరఖాస్తులు సైతం పరిశీలిస్తామని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో అధిక దరఖాస్తులు పింఛన్ల కోసమే వచ్చేవని, వాటి సంఖ్య తగ్గుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చేయూత పింఛన్ల మంజూరు నిరంతరంగా కొనసాగుతుందని తెలిపా రు. కార్యక్రమంలో డీఆర్‌డీవో దత్తారావు, మున్సి పల్‌ వైస్‌ చైర్మన్‌ ఎండీ అహ్మద్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ అలీబిన్‌ అహ్మద్‌, డీపీఎం రామకృష్ణ, ఎంపీడీవో శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అంజ య్య, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

చేయూతతో పేదలకు ఆర్థిక భరోసా

కాగజ్‌నగర్‌టౌన్‌: చేయూత పింఛన్లు పేదలకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కార్యాలయ సమావేశ హాలులో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ, మండలంలోని లబ్ధిదారులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ షాహిన్‌ సుల్తానాతో కలిసి అందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వా త చేయూత పింఛన్లు మంజూరు కావడం పేదవారికి వరమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ తిరుపతి, ఎంపీడీవో ఉజ్వల్‌కుమార్‌, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌లో ప్రొసీడింగ్స్‌ ఇస్తున్న కలెక్టర్‌ హరిత, ఎమ్మెల్యే హరీశ్‌బాబు

ఆసిఫాబాద్‌లో ప్రొసీడింగ్స్‌ ఇస్తున్న కలెక్టర్‌ హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement