ఆసిఫాబాద్‌అర్బన్: విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ శాఖ ఎస్ఈ, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల పనులను గురువారం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యతపై సూచనలు చేశారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఓవర్‌లోడ్‌కు అనుగుణంగా అవసరమైన చోట అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎస్ఈ ఉత్తమ్ జాడె, ఎస్‌ఏవో దేవిదాస్, డీఈలు సుధాకర్, నాగరాజు, ఏఈలు, సిబ్బంది ఉన్నారు.


