రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

Nov 13 2026 12:22 AM | Updated on Nov 13 2026 12:22 AM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని టీడబ్ల్యూఆర్‌ఎస్‌ మోడల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ బాలిక ల పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థినులు అండర్‌– 17 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌, ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. గురువారం నుంచి ఈ నెల 15 వరకు మహబూబ్‌నగర్‌లో నిర్వహించే హ్యాండ్‌బాల్‌ పోటీల్లో, శామీర్‌పేట్‌లో నిర్వహించే ఖోఖో పోటీల్లో వీరంతా పాల్గొనున్నారు. హ్యాండ్‌బాల్‌ విభాగంలో మౌనిక, మహేశ్వరి, కవిత, అంజలి, సుశీల, లక్షిత, లక్ష్మి, ఆర్తి ఎంపిక కాగా, ఖోఖో విభాగంలో సాగరిక, స్వీటి, శిరీష, అనూష, లక్ష్మి, గీతాంజలి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. డీడీటీవో అంబాజీ, ఏసీఎంవో ఉద్దవ్‌, జీసీడీవో శకుంతల, హెచ్‌డబ్య్లూ విజయలక్ష్మి, పీడీ మీనారెడ్డి, ఎస్జీఎఫ్‌ కార్యదర్శి రామ్మోహన్‌రావు, ఉపాధ్యాయుడు జంగు, కోచ్‌లు అరవింద్‌, విద్యాసాగర్‌, తిరుమ ల్‌, రాకేష్‌, ఏటీడీవో చిరంజీవి క్రీడాకారుల ను ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement