‘భూములు కబ్జా చేసేందుకే నోటీసులు’ | - | Sakshi
Sakshi News home page

‘భూములు కబ్జా చేసేందుకే నోటీసులు’

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

కాగజ్‌నగర్‌రూరల్‌: సర్‌సిల్క్‌ కంపెనీ భూములు కబ్జా చేయడానికే బీజేపీ ఎమ్మెల్యే హరీశ్‌బాబు, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ కలిసి పేదల ఇళ్లు తీసేయాలని నోటీసులు ఇచ్చారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఏవోకు సోమవారం వినతిపత్రం అందించారు. అనంతరం కోసినిలోని తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు తెలియకుండా రెవెన్యూ అధికారులు నోటీసులు ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 50 ఏళ్లుగా ప్రజలు ఈ భూమిలో నివసిస్తున్నారని, పేదలకు ఇంటి నంబర్‌, కరెంట్‌ బిల్లులు, ఆధార్‌, ఓటరు కార్డులు ఉన్నాయని తెలిపారు. కంపెనీ తీసేసినప్పుడు గ్రాట్యూటీ రూ.5 లక్షలు ఇవ్వకుండా, కేవలం రూ.40 వేలు ఇచ్చారని, మిగితా రూ.4 లక్షలకు పైగా ఎగొట్టరని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4800 మంది పేద కుటుంబాలు ఉంటే ఇప్పటికే మూడు వేల మందికి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. పేదలపై జరుగుతున్న అన్యాయంపై చర్చించడానికి చర్చకు సిద్ధమేనని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement