కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలోని పలు గ్రామాల్లో ఆదివారం ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని 16 వార్డులో ఏ.పుష్పలత నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంట్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ దండె విఠల్, అదనపు కలెక్టర్ డేవిడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ షాహిన్ సుల్తానా హాజరై దీపావళి సంబురాలు అట్టహాసంగా జరుపుకొన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజలతో కలిసి దీపావళి సంబురాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కచ్చకాయల జ్యోతి, కావేటి విజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


