ఆశ్రమాలు వందశాతం ఉత్తీర్ణత సాధించాలి | - | Sakshi
Sakshi News home page

ఆశ్రమాలు వందశాతం ఉత్తీర్ణత సాధించాలి

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

కెరమెరి: పదో తరగతి వార్షిక పరీక్షల్లో గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలు వందశాతం ఉత్తీ ర్ణత సాధించాలని జిల్లా గిరిజన సంక్షేమాధి కారి జాదవ్‌ అంబాజీ అన్నారు. మండలంలో ని మోడి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సోమవారం సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పరిశీలించారు. వంట, సరుకు నిల్వ గదులు, ప్రత్యేక తరగతులు తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఉత్తమ ఫలితాలకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఉదయం, సాయంత్రం పకడ్బందీగా ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. చదువులో వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దీపావళి సెలవులు ఉన్నా అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరు కావడంపై హెచ్‌ఎం ప్రేందాస్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement