ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తరలివచ్చి అర్జీలు అందించారు. దీపావళి పండుగ నేపథ్యంలో రద్దీ తక్కువగా కనిపించింది. డీఆర్‌డీవో దత్తారావు ఏవో కిరణ్‌కుమార్‌తో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా 30 ఏళ్లుగా సాగు చేస్తున్న పోడు భూమిని తన పేరిట పట్టా చేయాలని వాంకిడి మండలం డాబా గ్రామానికి చెందిన కిశహద్రి దరఖాస్తు చేసుకున్నాడు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కాగజ్‌నగర్ మండలం కొత్త సార్సాల గ్రామానికి చెందిన రైతులు విన్నవించారు. తిర్యాణి మండలం మంగీ పంచాయతీ పరిధిలోని శ్రీరాంపూర్‌గూడకు చెందిన మడావి రోజా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకుంది. రెబ్బెన మండలం గంగాపూర్‌కు చెందిన సాగాల చిన్నుబాయి గ్రామ శివారులో కుమారుడి పేరిట పట్టా ఉన్న భూమి తన పేరిట విరాసత్ చేయాలని కోరింది.


