ఇంధన వనరులు రోజురోజుకూ తగ్గిపోతున్నందున ఈ శక్తిని ఆదా చేయాలనే ఉద్దేశంతో స్వయం చాలకంగా వెలిగే స్మార్ట్ వీధి దీ పాలను వాంకిడి హైస్కూల్ విద్యార్థులు అ ఖిల్, ప్రజ్ఞన్ రూపొందించారు. కరెంట్‌ను ఆదా చేసి భావితరాలకూ విద్యుత్ కొరత లే కుండా ఉండాలనే ఉద్దేశంతో దీనిని తయారు చేసినట్లు వారు తెలిపారు. వాహనాల కదలి కను గుర్తించి వీధి దీపాలు వెలుగుతాయని, నిర్ణీత సమయం తర్వాత ఆఫ్ అవుతాయని పేర్కొన్నారు. దీనితో విద్యుత్ వినియోగం త గ్గించడం, రహదారిపై దృశ్యమానతను మెరుగుపరచడం జరుగుతుందని వివరించారు.


