వెలుగుల పండుగకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

వెలుగుల పండుగకు వేళాయె

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

● రద్దీగా జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ ● సందడిగా పటాకుల దుకాణాలు

ఆసిఫాబాద్‌అర్బన్‌: దీపం జ్ఞానానికి ప్రతీక. ఏ శుభకార్యం జరిగినా జ్యోతి ప్రజ్వలనతోనే ప్రా రంభిస్తాం. దీపావళి నాటి వెలుగులు జగమంతా కాంతిమయం చేస్తాయి. ప్రతీ వ్యక్తికి జీ వితంలో దీపావళి ఓ మరువలేని పండుగ. పండుగరోజు బొమ్మల పండుగ నిర్వహిస్తారు. ఇళ్లలో బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాలు జరుపుకొంటారు. వ్యాపారులు దీపావళి రోజు లక్ష్మీపూజలు నిర్వహించనుండగా దుకాణాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. పండుగ సందర్భంగా మా ర్కెట్లు, వ్యాపార సముదాయాలు, పటాకుల దుకాణాలు సందడిగా మారాయి.

వేడుక ప్రశాంతంగా జరుపుకోవాలి : కలెక్టర్‌

జిల్లా ప్రజలు దీపావళి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్‌ హరిత ఓ ప్రకటనలో సూచించారు. జిల్లా ప్రజలకు శుభా కాంక్షలు తెలిపారు. పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సుఖఃసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షించారు. ప్రతీ ఇంట్లో సంతోషం, ఆనందం వెల్లివిరియాలని కోరారు. ప్రజలు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని కాలుష్యాన్ని తగ్గించేలా పండుగ జరుపుకోవాలని, పటాకులు కాల్చేటపుడు చిన్న పిల్లలు, మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రద్దీగా మారిన జిల్లా కేంద్రంలోని మార్కెట్‌

పటాకులు కొనుగోలు చేస్తున్న ప్రజలు

జోరుగా బంతిపూల విక్రయం

కాగజ్‌నగర్‌టౌన్‌: దీపావళి సందర్భంగా మా ర్కెట్లో బంతి పూల అమ్మకాలు జోరుగా సా గుతున్నాయి. శనివారం ఉదయం నుంచే మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు, చిరువ్యాపారులు పూలు తీసుకువచ్చి పట్టణంలోని మార్కెట్లో రోడ్లపై అమ్మకాలు చేపట్టారు. బంతి పూల ధర గతేడాదితో పో లిస్తే ఈసారి తక్కువగా ఉంది. కిలో రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement