పీఎంశ్రీ స్కూళ్లలో అన్ని వసతులుండాలి | - | Sakshi
Sakshi News home page

పీఎంశ్రీ స్కూళ్లలో అన్ని వసతులుండాలి

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

కలెక్టర్‌ హరిత అధికారులతో సమీక్ష

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లాలో పీఎంశ్రీకి ఎంపికై న పాఠశాలల్లో అన్ని వసతులుండాలని కలెక్టర్‌ హరిత సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జిల్లా విద్యాధికారి సచ్చిదానందచారితో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 18 పాఠశాలలు పీఎంశ్రీకి ఎంపికై నట్లు తెలిపారు. ఆయా పాఠశాలలకు వచ్చిన నిధులను విద్యార్థులకు అవసరమైన వసతుల కోసం ఖర్చు చేయాలని సూచించారు. విద్యార్థులకు కరాటే, యోగా, కంప్యూటర్‌ తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. అవసరానికి అనుగుణంగా పిల్లలను విజ్ఞాన, పారిశ్రామిక యాత్రలకు తీసుకెళ్లాలని సూ చించారు. పాఠశాలల్లో చేపట్టే కార్యక్రమాలు పు రోగతి సాధించాలని, నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్వో శ్రీనివాస్‌, అబిద్‌ అలీ పాల్గొన్నారు.

రుణాలు రీషెడ్యూల్‌ చేయాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదైన ఐదు మండలాల్లో రైతులకు ఖరీఫ్‌లో ఇచ్చిన బ్యాంక్‌ రుణాలను రీ షెడ్యూల్‌ చేయాలని కలెక్టర్‌ హరిత సూచించారు. కలెక్టరేట్‌లో కరువు సహాయ చర్యలపై ఎల్‌డీఎం జనార్దన్‌, జిల్లా వ్యవసాయాధికారి వెంకటితో కలిసి బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వ్యవసాయ అనుబంధ రుణాలను కూడా రీషెడ్యూల్‌ చేయాలని తెలిపారు. అర్హులైన ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు కలిగిన రైతులకు రుణాలు ఇవ్వాలని, రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పించుకోకూడదని సూచించారు. బ్యాంక్‌ మేనేజర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దు

జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద పొరుగు సేవల ప్రాతిపదికన చేపట్టను న్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టులు, వైద్యారోగ్యశాఖలో భర్తీ ప్రక్రియ పారదర్శకంగా, ప్రభు త్వ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించనున్న ట్లు కలెక్టర్‌ హరిత ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాలిప్పిస్తామంటూ ఆశ చూపే దళారులు, మధ్యవర్తుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement