రెబ్బెన: ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదోడి సొంతింటి కల సాకారమైందని ఆర్టీఏ జిల్లా సభ్యుడు లావుడ్య రమేశ్ పేర్కొన్నారు. శనివారం రాత్రి సింగల్గూడలో ఇందిరమ్మ లబ్ధిదారు అజ్మీరా స్వప్న, సాయికుమార్‌తో కలిసి కాంగ్రెస్ నాయకులు దీపాలు వెలి గించి, టపాసులు కాల్చి వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ప్రజాపాల న ప్రభుత్వంతోనే ఇందిరమ్మ లబ్ధిదారులు సొంతింటిని నిర్మించుకోగలిగారని చెప్పారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కాంగ్రెస్ నాయకులను శాలువాలతో సన్మానించారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దుర్గం సోమయ్య, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మోడెం సుదర్శన్‌గౌడ్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దుర్గం దేవాజీ, పట్టణ మాజీ అధ్యక్షుడు మురళి, ఇంది రమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు రాజేంద్రప్రసాద్‌గౌడ్, అన్నాజీ, నాయకులు శాంతికుమార్‌గౌడ్, నగేశ్, అజ్మీరా గోపి, రవి తదితరులు పాల్గొన్నారు.


