కౌటాల(సిర్పూర్(టి): సిర్పూర్(టి) ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో శనివారం పెంచికల్‌పేట్ అంగన్‌వాడీ టీచర్ దరఖాస్తుదారు ల ధ్రువపత్రాలను సీడీపీవో హేమలత పరిశీ లించారు. పెంచికల్‌పేట్ మండలంలో ఒక టీ చర్ పోస్టుకు గాను 16మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. నాలుగు రోజులుగా సి ర్పూర్(టి), బెజ్జూర్, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్ మండలాలకు చెందిన అ భ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. త్వరలో ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సూ పర్‌వైజర్లు పద్మ, శంకరమ్మ, అలేఖ్య, కరుణ, హాసీనా, సీనియర్ అసిస్టెంట్ ఖాళీమ్, జూని యర్ అసిస్టెంట్ అర్జున్ తదితరులున్నారు.


