ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థి దశలోనే శాసీ్త్రయ ఆలోచనలు పెంపొందించే దిశగా విద్యాశాఖ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను సంసిద్ధులను చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా నుంచి వివిధ పాఠశాలకు చెందిన 72మంది విద్యార్థులు శనివారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వ్యర్థాల నిర్వహణ, ఇంధన సంరక్షణ, నీటి వనరుల పరిరక్షణ, ఆహార వ్యవసాయం, ఆరోగ్యం, భారతీయ జ్ఞాన వ్యవస్థల ద్వారా సుస్థిర జీవనం తదితర అంశాలపై ప్రాజెక్టులు రూపొందించి న్యాయ నిర్ణేతల ముందు ప్రదర్శించారు. 36 ప్రాజెక్టులకు గాను ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన మూడింటిని న్యాయనిర్ణేతలు రాష్ట్ర స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలకు ఎంపిక చేశారు. ప్రతిభావంతులకు డీఈవో సచ్చిదానందచారి ప్ర శంసాపత్రాలు, బహుమతులు అందించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. సైన్స్ కాంగ్రెస్ విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని, పరిశోధనా ఆసక్తిని, సృజనాత్మక ఆలోచనా విధానాన్ని పెంచడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను శాసీ్త్ర య దృష్టితో పరిశీలించి, వాటికి పరిష్కారాలు కనుగొనే దిశగా కృషి చేయాలని సూచించారు. జిల్లా సైన్స్ అధికారి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.


