ప్రస్తుత కాలంలో చాలామంది వివిధ రోగాల బారిన పడి నిత్యం మందులు వాడుతున్నా రు. బిజీ లైఫ్లో ఒక్కోసారి మందులు వేసుకోవడం మరిచిపోతుంటారు. ఈ సమస్యకు చెక్ పెట్టేలా కాగజ్నగర్ విశ్వశాంతి హైస్కూ ల్ విద్యార్థినులు భవిత, ప్రతిభ సమయానికి మందులు వేసుకునేలా అలర్ట్ చేసే ఆటోమేటిక్ మెడిసిన్ రిమైండర్ ప్రాజెక్ట్ను రూపొందించారు. ముందుగా ఆడియో ప్రోగ్రాం త యారు చేశాక టైమర్ లేదా ఆర్టీసీ మాడ్యు ల్ సహాయంతో ఇది సమయాన్ని గుర్తిస్తుంది. మనం సెట్ చేసిన మందులు వేసుకునే సమ యం వచ్చినప్పుడు బజర్ మోగుతుంది. ఎల్ఈడీ లైట్ వెలుగుతుంది. దీంతో మందులు వేసుకునే సమయం వచ్చిందని మనకు తెలుస్తుంది. బజర్, ఎల్ఈడీ సహాయంతో ఇది మనల్ని అలర్ట్ చేస్తుందని దీనిని రూపొందించిన విద్యార్థినులు వివరించారు.


