పెండింగ్‌ బిల్లులు వెంటనే మంజూరు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు వెంటనే మంజూరు చేయాలి

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

కెరమెరి: ఉద్యోగ, ఉపాధ్యాయులకు జూలై 2023 నుంచి రావాల్సిన వేతన సవరణను (పీఆర్‌సీ) ప్రభుత్వం వెంటనే విడుదల చే యాలని పీఆర్టీయూ టీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆడే ప్రకాశ్‌ కోరారు. శనివారం సిర్పూర్‌ (యు) మండల కేంద్రంలో ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 ఏళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు, కేజీబీవీల్లో పని చేస్తున్న సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వీరికి మినిమం టైంస్కేల్‌ ప్రకటించడంతో పాటు సమ్మెకాలపు వేతనాన్ని చెల్లించాలని కోరారు. కేజీ బీవీల్లో వేసవి సెలవుల్లో పని చేయించుకుని వేతనాల్లో కోత విధించడం అన్యాయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన అన్ని రకాల పెండింగ్‌ బిల్లులను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. స ర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు రాథోడ్‌ శ్రీనివాస్‌, భూమున్న, ఆత్రం దత్తు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement