ఉమ్మడి జిల్లా సెపక్‌తక్రా ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లా సెపక్‌తక్రా ఎంపిక పోటీలు

Nov 8 2026 12:19 AM | Updated on Nov 8 2026 12:19 AM

రెబ్బెన: గోలేటి టౌన్‌షిప్‌ లోని సింగరేణి పాఠశాల మైదానంలో శనివారం ఉమ్మడి జిల్లా సెపక్‌తక్రా జోనల్‌స్థాయి స్కూల్‌ గే మ్స్‌ అండర్‌–14, 17, 19 బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పలువురు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జనగామ జిల్లాలో ఈనెల 12 నుంచి 14 వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని ఉమ్మడి జిల్లా సెపక్‌తక్రా అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు తిరుపతి, రాష్ట్రస్థాయి కార్యవర్గ సభ్యులు భాస్కర్‌, మల్లేశ్‌ వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టుదలతో ఆడి జిల్లా క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో గోలేటి సర్పంచ్‌ అజ్మీర బాబురావు, సెపక్‌తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శిరీష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుమ్మరి మల్లేష్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి పోశం, పీడీ వశీం ఖాన్‌, శారద, స్వప్న, పీఈటీ రవి తదితరులు పాల్గొన్నారు.

ఎంపికై న అండర్‌–14 జట్టు

అండర్‌–14 బాలుర జట్టులో సీహెచ్‌ హరీశ్‌, జె.అభిషేక్‌, డి.శివప్రణీత్‌, కె.కేశవరావు, కె.సాయి శ్రీరాం, సీహెచ్‌ అంకిత్‌, జె.ప్రణీత్‌. బాలికల జట్టుకు కె.దర్శిని, ఎం.యాసశ్రీ, జి.అక్షయ, జి.స్వరూప, డి.వైష్ణవి, ఎ.సహస్విని, పి.ప్రితి ఎంపికయ్యారు.

క్రీడా నైపుణ్యాలు పెంచుకోవాలి

రెబ్బెన: సింగరేణిలో పనిచేసే ఉద్యోగ క్రీడాకారులు క్రీడా నైపుణ్యాలు పెంచుకుంటూ పోటీల్లో రాణించాలని బెల్లంపల్లి ఏరియా ఎస్వోటూ జీఎం స్వామిరాజు అన్నారు. శనివారం గోలేటి టౌన్‌షిప్‌లోని భీమన్న స్టేడియంలో డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ 93వ వార్షిక క్రీడల్లో భాగంగా నియర్‌ బై అథ్లెటిక్స్‌ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల ఉద్యోగ క్రీడాకారులు సమిష్టిగా పాల్గొని కోలిండియా పోటీల్లో పతకాలు సాధించాలన్నారు. ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎస్‌.తిరుపతి, డీజీఎం పర్సనల్‌ దేవరకొండ కిరణ్‌బాబు, డబ్ల్యూపీఎస్‌ అండ్‌ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్‌, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ అశోక్‌, కోఆర్డినేటర్‌ కిరణ్‌బాబు, జన రల్‌ కెప్టెన్‌ అబ్బాస్‌, ఏఐటీయూసీ నాయకులు మారం శ్రీనివాస్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement