● ఆలస్యంగా వెలుగులోకి..
ఆసిఫాబాద్‌రూరల్/తిర్యాణి: ఆసిఫాబాద్ మండలం కోసార పంచాయతీ పరిధిలోని ఒకరిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వె లుగులో వచ్చింది. సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం..తిర్యాణి మండలా నికి చెందిన ప్రసాద్ (34), సాగర్, చందులు కర్ర బొంగులతో వివిధ రకా ల పనులు చేయడానికి మండలంలోని మాలన్‌గొంది గ్రామానికి గతనెల 30న వచ్చారు. ఈనెల 5న ఆసిఫాబాద్‌కు వచ్చి నిత్యావసర సరుకులు తీ సుకుని వెళ్తున్నారు. కోసర పంచాయతీ పరిధిలో మద్యం సేవించారు. సా గర్ వెళ్లిపోగా చందు, ప్రసాద్ మద్యం తాగి గొడవపడ్డారు. ఈక్రమంలో ప్రసాద్ తలపై బండతో కొట్టి చంపి సమీపంలో వాగులో పడేశారు. జరిగి న విషయాన్ని చందు సాగర్‌కు చెప్పాడు. భార్య ఉషారాణి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం కోసార వాగులో మృతదేహాన్ని గుర్తించారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
కాంట్రాక్టర్ ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన
తిర్యాణికి చెందిన ప్రసాద్‌ను పనిలోకి తీసుకెళ్లిన సదరు కాంట్రాక్టర్ నష్టపరిహారం చెల్లించాలని మృతుడి కుటుంబ సభ్యులు,బంధువులు డిమాండ్ చేశారు. మృతదేహంతో కాంట్రాక్టర్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. చనిపోయిన సమాచారం ఇవ్వకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, రూ.10 లక్షల పరిహారం ఇస్తేనే ఆందోళన విరమిస్తామన్నారు.


