ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా విద్యార్థులు క్రీడారంగంలో ఉన్నతస్థాయికి ఎదగాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థినులకు సీఎస్‌ఆర్ ఫండ్స్, రవి ఫుడ్స్, చీప్ టు గ్రిడ్, త్రీఎఫ్ ఇండసీ్ట్రస్ లిమిటెడ్ సహకారంతో ట్రాక్‌సూట్స్, ష్యూ, టీషర్టులు, షార్టులతో కూడిన కిట్లను డీటీడీవో అంబాజీతో కలిసి అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కోచ్‌లు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్‌వో షేకు, నోడల్ అధికారి మీనారెడ్డి, హెచ్‌ఎం లింబారావు, కోచ్‌లు విద్యాసాగర్, తిరుమల్, అరవింద్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి రామ్మోహన్‌రావు పాల్గొన్నారు. అనంతరం క్రీడాపాఠశాలలో వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఆసిఫాబాద్‌అర్బన్: జాతీయ ఆయుష్ మిషన్ పరిధిలోని వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ కె.హరిత శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మల్టీపర్పస్ వర్కర్స్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 3న ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు సకాలంలో చేరుకోవాలని సూచించారు.


