ఆసిఫాబాద్: హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం డిమాండ్ చేశారు. హిందూ మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కుమురంభీం చౌక్ వద్ద సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ హిందూ ధర్మం, దేవతలను కించపరిచేలా సీఎం వ్యాఖ్యలు చేయ డం సరికాదన్నారు. ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ పతనాన్ని కొని తెచ్చుకోవద్దని హితవు పలికా రు. జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఖాండ్రే విశాల్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సుచిత్, పార్టీ మండల అధ్యక్షులు సుంకరి పెంటయ్య, సారా రమేశ్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.


