కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ బస్టాండ్ నుంచి ప్రతిరోజూ సిర్పూర్(టి), కౌటాల, మంచిర్యాల, అలాగే పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ సమీపం నుంచి దహెగాం, పెంచికల్‌పేట్, ఈజ్‌గాం తదితర ప్రాంతాలకు ఆటోలు నడుస్తున్నాయి. డ్రైవర్లు పరిమితికి మించి ఒక్కో వాహనంలో పది మంది ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. పది మంది ఉంటేనే పాయింట్ నుంచి బయలుదేరుతామని డ్రైవర్లు షరతు పెడుతుండటం గమనార్హం. ఇక కాగజ్‌నగర్ మండలంలోని రాస్పెల్లి, ఈజ్‌గాం, వల్లకొండ, నామనగర్ గ్రామాల నుంచి నిత్యం పాఠశాలల విద్యార్థులు ఆటోల్లోనే ప్రమాదకరంగా వెళ్తున్నారు. ఇక పట్టణంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఒక్కో ఆటోలో 15 మంది నుంచి 20 మంది వరకు విద్యార్థులను తరలిస్తున్నారు.


