రుచికరమైన పౌష్టికాహారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

రుచికరమైన పౌష్టికాహారం అందించాలి

Sep 30 2026 1:16 AM | Updated on Sep 30 2026 1:16 AM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌రూరల్‌: విద్యార్థులకు నాణ్యమైన విద్య, రుచికరమైన పౌష్టికాహారం అందించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జైనూర్‌ మండలం భూసిమెట్ట గిరిజన బాలికల గురుకుల పాఠశాలను మంగళవా రం సందర్శించారు. హాజరు శాతం, వంటగది, సరుకుల నిల్వను పరిశీలించారు. వంట కోసం తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులు వినియోగించాలన్నారు. బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, పాఠశాల ఆవరణ, వసతి గదులు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. రూ.లక్షల విలువైన మందులు కాలం చెల్లిపోవడం, రోగ నిర్ధారణ పరీక్ష యంత్రాలు మూలనపడి ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లో మళ్లీ వస్తానని యంత్రాలకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.

అర్హులందరూ ఓటరు జాబితాలో ఉండాలి

కెరమెరి: సర్‌ ప్రక్రియలో భాగంగా అర్హులందరూ ఓటరు జాబితాలో ఉండే చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. హియరింగ్‌ ప్రక్రియ, భూముల రీసర్వేపై అధికారులతో సమీక్షించారు. సమావేశంలో తహసీల్దార్‌ నాగార్జున, డీటీ సంతోష్‌ కుమార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement