కౌటాల: కౌటాల– కాగజ్‌నగర్ ప్రధాన రహదారి మార్గంలో ఆశించిన స్థాయిలో ఆర్టీసీ సేవలు అందుబాటులో లేక నిత్యం ప్రయాణికులు ఆటోలనే ఆశ్రయిస్తున్నా రు. కౌటాల నుంచి చింతలమానెపల్లి, బెజ్జూర్, భూరెపల్లి, తుమ్మిడిహెట్టి మార్గాల్లోనూ ఆటోలు నడుస్తుంటాయి. కౌటాల మండలం తాటిపల్లి, బండలహెట్టి, గోవర్‌హెట్టి, కన్నెపల్లి, కనికి, నాగేపల్లి, పార్డీ, సాండ్‌గాం, కౌఠి, వీరవెల్లి గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నా ఆర్టీసీ బస్సు రావు. ఇదే అదునుగా విద్యార్థులను ప్రైవేట్ వాహనదారులు పరిమితికి మించి తరలిస్తున్నారు.


