ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని పోలీసు ఏఆర్ హెడ్ క్వార్టర్‌లో ప్రతిష్టించిన గణనాథుడికి ఎస్పీ నితిక పంత్ శుక్రవారం సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఐదో రోజు నిర్వహించిన అన్నప్రసాద వితరణలో పాల్గొని భక్తులు, సిబ్బందికి స్వయంగా వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు సిబ్బంది ఐకమత్యం, అంకిత భావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో శాంతియుత వాతావరణంలో విజయవంతం జరుపుకొందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సతీష్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ సంపత్, ఇన్‌స్పెక్టర్ రాజు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్(అడ్మిన్) వామనమూర్తి, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్(ఎంటీవో) అంజన్న, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్(స్పెషల్ పార్టీ) శ్రీనివాస్, ఆర్‌ఎస్సై లవన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.


