జాతీయస్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

Sep 13 2026 11:45 PM | Updated on Sep 13 2026 11:45 PM

ఆసిఫాబాద్‌రూరల్‌: జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థిని జంగుబాయి జాతీయస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికైంది. ఆదివారం కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్‌ అరుణ శ్రీ, వైస్‌ ప్రిన్సిపాల్‌ అనిత, పీడీ లక్షితో కలిసి అభినందించారు. వారు మాట్లాడుతూ ఆగస్టు 26 నుంచి 27 వరకు హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్‌– 16 బాలికల జావెలిన్‌ త్రో పోటీల్లో మడా వి జంగుబాయి ప్రతిభ చూపిందన్నారు. ఈ నెల 14 నుంచి 18 వరకు పాండిచ్చేరిలో జరిగే జాతీయస్థాయి జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాపియన్‌ షిప్‌కు తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. జాతీయ స్థాయిలోనూ విజయం సాధించాలని కోచ్‌ విద్యాసాగర్‌ ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement