1 నుంచి 9వ తరగతి వరకు ఎక్స్‌టర్నల్ ఎవాల్యుయేషన్ ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
ఆసిఫాబాద్‌రూరల్: ఇప్పటివరకు సొంత పాఠశాలల్లోనే జరుగుతున్న ఎస్‌ఏ– 1, ఎస్‌ఏ– 2 జ వాబు పత్రాల మూల్యాంకనం ఇక కుదరదు. మండల విద్యా వనరుల కేంద్రాల్లో ఎక్స్‌టర్నల్ ఎవాల్యుయేషన్ పద్ధతిలో జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే బాహ్య మూ ల్యంకన విధానంపై ఉపాధ్యాయ వర్గాలు అ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బోధన చేయాల్సి న సమయాన్ని ఎమ్మార్సీ కేంద్రాల్లో మూల్యాంకనానికి కేటాయించడం ద్వారా టీచర్‌పై ఒత్తిడి పెంచుతుందని చెబుతున్నారు. అలాగే తరగతి గది బోధన దెబ్బతిని, విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, మండల కేంద్రాలకు వెళ్లాల్సి రావడంతో సమయం వృథా అవ్వడమే కాక, రవాణా పరమైన ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా క్షేత్రస్థాయిలోని పరిస్థితులు, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే మూల్యాంకన విధానంపై తుది నిర్ణయం ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఆన్‌లైన్‌లో మార్కులు
ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, ఉ న్నత పాఠశాలకు ఒకరు చొప్పున ఎవాల్యుయేషన్ ఇన్‌చార్జీలను నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 3 నుంచి ఐదు రోజుల్లో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి ఆన్‌లైన్‌లో మార్కులు నమో దు చేయనున్నారు. తరగతులు, సబ్జెక్టుల వారీగా ఆ న్‌లైన్‌లో మార్కులు అందుబాటులో ఉంచుతారు. అలాగే 1 నుంచి 5వ తరగతి వరకు రూ.2లు, 6 నుంచి 10వ తరగతి వరకు రూ.3 చొప్పున ఉపాధ్యాయులకు ఎన్యూమరేషన్ చెల్లిస్తారు.
ఎమ్మార్సీకి జవాబు పత్రాలు
జిల్లాలో 733 ప్రభుత్వ పాఠశాలల్లో 45,273 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2,447 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఎస్‌ఏ– 1, 2 పరీక్షలకు సంబంధించిన జవాబు ప త్రాలను అయా పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల దిద్దేవారు. కొత్త విధానం అమల్లో కి వస్తే ఈ పరిస్థితి ఉండదు. అన్ని ప్రభు త్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన జవాబు పత్రాలను మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీలకు చేరుస్తారు. అక్కడ ఒక పాఠశాలకు చెందిన పరీక్ష పత్రాలను వేరే పాఠశాల ఉపాధ్యాయులతో దిద్దిస్తా రు. విద్యార్థుల ప్రతిభను నిష్పక్షపాతంగా అంచనా వేయడం, మూల్యాంకనంలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా నూతనం విధానం తీసుకొచ్చినట్లు అధి కారులు చెబుతున్నారు.
త్వరలోనే అమలు
పాఠశాలల్లో నిర్వహించే ఎస్‌ఏ– 1, 2 పరీక్షలకు సంబంధించి మూల్యాంకనా న్ని ఎమ్మార్సీల్లో చేసేలా ప్రభుత్వం ఈ విధానం తీసుకొచ్చింది. విద్యాశాఖ ఆదేశాల మేరకు జిల్లాలో త్వరలోనే కొత్త ఎ క్స్‌టర్నల్ ఎవాల్యుయేషన్ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
– సచ్చిదానంద చారి, డీఈవో


