వాంకిడి: వినాయక మండపాల వద్ద నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఉత్తమ్ జాడె అన్నారు. మండల కేంద్రంలోని 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాన్ని ఆదివారం తనిఖీ చేశారు. విద్యుత్ సిబ్బందితోపాటు గణేష్ మండపాల నిర్వాహకులకు సూచనలు చేశారు. మండపాలు, రహదారులు, నిమజ్జన ప్రాంతాల వద్ద తెగిపోయిన తీగలు, లూజ్ వైర్లు, ప్రమాదకర స్తంభాలను గుర్తించి సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. తడిసిన తీగలు, స్విచ్‌లు, విద్యుత్ పరికరాలు తాకొద్దన్నారు. స్విచ్ బోర్డులు పిల్లలకు అందకుండా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్వాహకులు తప్పనిసరిగా భద్రత నియమాలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో మండల ఇంజినీర్‌లు దినేష్, శ్రీనివాస్, ప్రేమ్‌సాగర్, సిబ్బంది పాల్గొన్నారు.


