మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని సీఈఆర్ క్లబ్ ఆవరణలో ఆదివారం డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో ఏరియా స్థాయి ఇండోర్ గేమ్స్ నిర్వహించారు. ఈ పోటీలను ఏరియా సీనియర్ పీవో కార్తీక్ ప్రారంభించా రు. ఇందులో భాగంగా క్యారమ్స్, చెస్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు వెంకటేశ్వర్లు, క్లబ్ సెక్రెట రీ బానయ్య, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివకృష్ణ, జనరల్ కేప్టెన్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


