ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలోగల గణేశ్ మందిర్‌లో వందేళ్లకు పైబడి గణేశ్ నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలో వినాయకుడిని గరిక ప్రియుడిగా భక్తులు కొలుస్తారు. జిల్లాలోని ఏకై క అతి పురాతన ఆలయం కావడంతో గణనాథుడిని దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఆలయంలో ప్రతినెలా నిర్వహించే సంకష్టహర చతుర్థి పూజలు, కోజాగిరి, ఎక్కాహంతోపాటు పర్వదినాల్లోనూ భక్తులు అధికసంఖ్యలో పాల్గొంటారు. గణేశ్ నవరాత్రుల్లో భాగంగా ఇప్పటివరకు దాతల సహాయంతోనే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎప్పుడు కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. వినాయకుడి విగ్రహ దాతగా నిలిచేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ప్రస్తుతం మరో పదేళ్ల వరకు దాతల పేర్లు ఇదివరకే నమోదై ఉన్నాయి. భక్తుల సహకారంతో ఆలయంలో ఉత్సవాలు ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శోభాయాత్రగా వెళ్లి పెద్దవాగులో గణనాథుడిని నిమజ్జనం చేస్తారు.
కేశవనాథస్వామి ఆలయంలో 106 ఏళ్లుగా..
జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడలో కొలువున్న కేశవనాథుడు భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్నాడు. చోళుల కాలంలో సిర్పూర్ గ్రామంలో చెత్తకుప్పలో దొరికి బ్రాహ్మణవాడ పెద్దలతో ఆసిఫాబాద్ బ్రాహ్మణవాడలో వెలిసిన శ్రీకేశవనాథస్వామిని 300 ఏళ్ల క్రితం ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయంలో 106 ఏళ్లుగా నవరాత్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇటీవలే ఆలయంలో శతాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గణపతి నవరాత్రుల్లో నిత్యం భజన, ప్రసాద వితరణ, మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు చేపడతారు. పూర్వం పట్టణంలో నాలుగు ప్రాంతాల్లోనే గణేశ్ నవరాత్రులు నిర్వహించేవారు. ఆలయంలో గణేశ్ నవరాత్రులతోపాటు శారదాదేవి ఉత్సవాలు, కార్తీక మాసం కాకడహారతి నెలరోజులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆలయం దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉంది. నిత్య పూజలతో ఈ ఆలయం దేదీప్యమానంగా వెలుగొందుతోంది.
శివకేశవ మందిర్‌లో 103 ఏళ్లుగా..
జిల్లా కేంద్రంలోని శివకేశవ మందిర్ (వాసవీ) గణే శ్ మండలికి 103 ఏళ్ల చరిత్ర ఉంది. పట్టణానికి చెందిన శిర్ప వంశీయుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మా ణం చేపట్టారు. ఆలయంలో శివకేశవుల విగ్రహాలు ఏర్పాటు చేయగా, 26 ఏళ్లక్రితం వాసవీ మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పట్టణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో 1923లో తొలిసారి గణేశ్ నవరాత్రి వేడుకలు ప్రారంభించారు. వందేళ్ల క్రితం ప్రారంభించిన ఉ త్సవాలు నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. గతంలో ఆలయంలోపలి గదిలో గణనాఽఽథుడిని ప్రతి ష్ఠించగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం ఆలయం పక్కన ఏర్పాటు చేసిన వరండాలో నెలకొల్పుతున్నారు. గతంలో శివకేశవ మందిర్ పేరిట ఏర్పాటు చేసిన గణేశ్ మండలి ప్రస్తుతం వా సవీ గణేశ్ మండలిగా మార్పు చెందింది. మూడు దశాబ్దాల క్రితం వరకు గణేశ్ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజూ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కు చెందిన భాగవతార్‌లతో హరికథ చెప్పించేవా రు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అంతటా గణపతి నవరాత్రోత్సవాలను తొమ్మిదిరోజుల పాటు నిర్వహిస్తుండగా, ఇక్కడ మాత్రం 11రాత్రుల అనంతరం 12వ రోజు విగ్రహాన్ని నిమజ్జనం చేయడం అనవాయితీగా వస్తోంది.


