ఘనంగా జాతీయ క్రీడాదినోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా జాతీయ క్రీడాదినోత్సవం

Aug 29 2026 11:57 PM | Updated on Aug 29 2026 11:57 PM

ఆసిఫాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని గిరిజ న బాలుర పాఠశాలలో శనివారం జాతీయ క్రీడాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత హాకీ క్రీడాకారుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి డీవైఎస్‌వో అశ్వక్‌ అహ్మద్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ధ్యాన్‌చంద్‌ క్రీడా రంగానికి అందించిన సేవలను కొనియాడారు. క్రీడాకారులు అతడిని స్ఫూర్తిగా తీసుకుని క్రీడారంగంలో రాణించాలని సూచించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటి జిల్లాకు పేరు తీసుకరావాలని కోరారు. అనంతరం క్రీడాపోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల కు బహుమతులు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో ఖేల్‌ ఇండియా కోచ్‌ రాజేష్‌, పీడీ మధుసూదన్‌, హెచ్‌ఎం గోపాల్‌, లక్ష్మీనారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement