ఆసిఫాబాద్‌అర్బన్: జాతీయ క్రీడాదినోత్సవా న్ని పురస్కరించుకుని ఐటీడీఏ ఆధ్వర్యంలో శనివారం ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో ఐ టీడీఏ పీవో మంద మకరందు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆసిఫా బాద్ గిరిజన క్రీడాపాఠశాలకు చెందిన అథ్లెటిక్స్‌లో ఎం.రాజేశ్వరి, అఖిల, హ్యాండ్‌బాల్‌లో నందిని, మౌనిక, ఖోఖోలో జంగుబాయి, సత్యశీలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అధికారులతో కలిసి సన్మానించారు. అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, హ్యాండ్‌బాల్ కోచ్ అరవింద్, ఖోఖో కోచ్ తిరుమల్‌ను శాలువా, ప్రశంసాపత్రాలతో సత్కరించారు.


