కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని డివిజనల్ సైన్స్ సెంటర్‌లో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ డ్రామా ఫెస్టివల్ అలరించింది. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన వందమంది విద్యార్థులు హాజరై కృత్రిమ మేథస్సు– స్నేహితుడా సాధనమా, ముప్పా..?, ఎలక్ట్రిక్ వాహనాలు– భవిష్యత్తు వైపు ముందడుగు, అంతరిక్ష నివాసాలు, సముద్రాల పునరుద్ధరణ– భవిష్యత్ తరాల పరిరక్షణ అంశాల్లో ప్రతిభను ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నటన ప్రతిభను మాత్రమే కాకుండా శాసీ్త్రయ ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు, బృంద స్ఫూర్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సామాజిక బాధ్యత వంటి సామర్థ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. జెడ్పీహెచ్‌ఎస్ జన్కాపూర్ విద్యార్థులు సహస్ర, నైనిత, ప్రియాంక, అపీన్ సమీర్, వర్షిని, అంజలి, సంజన ప్రథమ బహుమతి పొందగా, స్మైల్ కిడ్స్ స్కూల్ విద్యార్థులు నిశాంత్, యసిక, భారతి, శఫియా, అద్వైత్, రెహమాన్, అఖిల్, ఆసిన్ ద్వితీయ బహుమతి, ఈడెన్ గార్డెన్ స్కూల్ విద్యార్థులు వెంకటేశ్, శ్రీవాస్తవ్, దీక్ష, రాంచరణ్, తన్వీర్, సాయిచరణ్, రాజేశ్, జగన్ తృతీయస్థానం సాధించారు. వ్యక్తిగత ప్రతిభా పురస్కారాల్లో వి.రాజేశ్(జెడ్పీహెచ్‌ఎస్ జన్కాపూర్), బెస్ట్ యాక్టర్ ఈ.మీనాక్షి(కేజీబీవీ, కౌటాల) బహుమతులు సాధించారు. కార్యక్రమంలో ఎంఈవో ప్రభాకర్, డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, జనార్దన్, జిల్లా సైన్స్ అధికారి మధుకర్, సైన్స్ టీచర్ మామిడాల తిరుపతయ్య, వెంకటేశ్వర్లు, దుర్గాప్రసాద్, లక్ష్మి ప్రసన్న, దేవాజీ తదితరులు పాల్గొన్నారు.
కృత్రిమ మేథస్సుపై డ్రామా ప్రదర్శిస్తున్న విద్యార్థులు
భవిష్యత్ తరాల పరిరక్షణ అనే అంశంపై..
అంతరిక్ష నివాసాలు అనే అంశంపై..


