కడేర్ల రంగయ్యకు అరుదైన అవకాశం | - | Sakshi
Sakshi News home page

కడేర్ల రంగయ్యకు అరుదైన అవకాశం

Aug 29 2026 11:57 PM | Updated on Aug 29 2026 11:57 PM

కెరమెరి: మండలంలో ని సావర్‌ఖేడా పీఎంశ్రీ ప్రాథమిక పాఠశా ల ప్రధానోపాధ్యాయుడు కడేర్ల రంగయ్యకు అరుదైన అవకాశం దక్కింది. ప్రతిష్టాత్మక జపాన్‌ ఎక్స్‌పోజర్‌ విజిట్‌కు ఎంపికయ్యారు. ఈ మేరకు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్‌ స్వయంగా ఫోన్‌ చేసి ధ్రువీకరించినట్లు రంగయ్య తెలిపారు. ఆ గస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా తొలివిడతలో 29 మంది ఉపాధ్యాయుల జాబితా విడుదల చే యగా, ఆగస్టు 28న అదనంగా రంగయ్య పే రును జాబితాలో చేర్చారు. 30 మంది టీచ ర్లు, పది మంది విద్యాశాఖ ఉన్నతాధికారులతో కూడిన 40 మందితో కూడిన ప్రతినిధి బృందం సెప్టెంబర్‌ 5 నుంచి 12 వరకు జపా న్‌లో పర్యటించనుంది. అక్కడి పాఠశాలలు, ఆధునిక సాంకేతిక, సరికొత్త బోధనా పద్ధతులను పరిశీలించనుంది. మారుమూల ప్రాంతానికి చెందిన ప్రధానోపాధ్యాయుడికి అవకా శం దక్కడంపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement