తరలివచ్చి.. మొక్కులు చెల్లించి
కష్టాలు దూరం చేసి.. కోరిన కోర్కెలు తీర్చే కెరమెరి మండలం గోండ్ కరంజీవాడలోని నాగోబాకు ఆదివారం ఉమ్మడి జిల్లాతోపాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్, రాజురా, యవత్మాల్, పాండర్‌కవ్‌డా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చి మొక్కులు చెల్లించారు. గంపలో దేవుళ్లతో పాదయాత్రగా వచ్చి కుమరం బొజ్జు పటేల్ ఇంట్లో కొలువైన నాగోబాకు పూజలు చేశారు. పూజారి ఇంటి బయట నుంచి పాము మాదిరి పాకుతూ ఆలయంలోకి వెళ్లారు. భక్తులు పుట్ట వద్ద పుట్నాలు, బెల్లం సమర్పించారు. మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కార్యక్రమంలో బొజ్జు, గాగ్రు, సీతారాం, కోసు, విజయ్, దౌలత్‌రావు, భీంరావు, లక్ష్మణ్, నాగోరావు, యశోదాబాయి, గిరిజాబాయి, తుర్పుబాయి, రాంబాయి పాల్గొన్నారు. – కెరమెరి
తరలివచ్చి.. మొక్కులు చెల్లించి
తరలివచ్చి.. మొక్కులు చెల్లించి
తరలివచ్చి.. మొక్కులు చెల్లించి
తరలివచ్చి.. మొక్కులు చెల్లించి


