చిరకాల స్వప్నం నెరవేరింది
కాగజ్‌నగర్‌టౌన్: కేరళ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వడంతో సిర్పూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్‌బాబు అన్నారు. కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు మొదటిసారి ఆగడంతో జెండా ఊపి సిగ్నల్ ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రైలు హాల్టింగ్‌తో కేరళకు చెందిన వారికి, అయ్యప్ప స్వామి దీక్షపరులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపా రు. జిల్లా ప్రజలు వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుపతికి వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రైలుకు హాల్టింగ్ ఇచ్చేందుకు కృషి చేసిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రైలు పైలట్‌కు స్వీట్లు అందించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు శివకుమార్, కేరళ వాసులు శివప్రసాద్, కార్యకర్తలు, రైల్ యత్రి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
పత్రాలు అందజేత
పట్టణంలోని వార్డు నం. 8లో 14 మంది, గాంధీనగర్ కాలనీలో 11 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఆదివారం అందించారు. 45 రోజుల్లోగా నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. బీజేపీ నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్, అనిల్ పాల్గొన్నారు.


