కట్టుదిట్టంగా భద్రత చర్యలు
వాంకిడి/కాగజ్‌నగర్‌టౌన్: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ నితిక పంత్ అన్నారు. కాగజ్‌నగర్, వాంకిడి మండలాల్లో సోమవారం మంత్రి పర్యటించనున్న నేపథ్యంలో ఏఎస్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్‌తో కలిసి ఆదివారం బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. భద్రత చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు నిర్వహణ తదితర అంశాలపై ఆదేశాలు జారీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో సీఐలు సత్యనారాయణ, ప్రేమ్‌కుమార్, ఎస్సై మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.


