5న ‘చలో పార్లమెంట్’
కాగజ్‌నగర్‌టౌన్: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఫిబ్రవరి 5న చలో పార్లమెంట్ నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి తెలిపారు. పట్టణంలోని ఆదర్శనగర్‌లో ఆదివా రం డివిజన్ సమావేశం నిర్వహించారు. జాతీ య పెన్షన్ పథకం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, సర్వీస్‌లోని టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలని, జాతీయ విద్యావిధానాన్ని రద్దు చేయాలని, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయలకు ఎమ్మెల్సీ ఓటుహక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ నిరసన ప్రదర్శనకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు రాజ్‌కమలాకర్, దుర్గయ్య, మండల అధ్యక్షుడు బాలకృష్ణ, మహేశ్, ఉపాధ్యక్షులు సబిత రాణి, ఉపేందర్, సురేశ్, సంతోష్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


