గందరగోళంగా ముసాయిదా జాబితా
● ఒక వార్డు ఓటర్లు మరో వార్డులో ప్రత్యక్షం
కాగజ్‌నగర్‌టౌన్: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు విడుదల చేసిన కాగజ్‌నగర్ ముసాయిదా ఓటరు జాబితా గందరగోళంగా మారింది. 26వ వార్డులోని జా బితాలో సీరియల్ నంబర్ 1,130 నుంచి 1350 వరకు గల ఓటర్లు 28వ వార్డుకు చెంది న వారు. అయితే వారి పేర్లను 26వ వార్డు జాబితాలో చేర్చారు. అలాగే సుమారు 50 మంది మృతుల పేర్లు తొలగించకుండానే జా బితా ప్రదర్శించారు. వార్డు నం. 24, 27, 28, 7, 8, 23 వార్డుల్లో సైతం చనిపోయిన వారి పేర్లు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి పేర్ల ను సవరించలేదు. మరికొన్ని వార్డుల్లో భర్త, తండ్రి పేర్లు లేకుండానే రూపొందించారు. ఓ టరు జాబితా తప్పుల తడకగా ఉండటంతో నాయకులు అభ్యంతరాలు సమర్పించేందు కు సన్నద్ధమవుతున్నారు. సోమవారం నిర్వహించే రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. తప్పిదాల ప్రభావం రిజర్వేషన్లపై పడే అవకాశముందని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే తప్పిదాలను సవరించాలని కోరుతున్నారు.


