‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీ క్షల్లో జిల్లా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సా ధించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తి వారి అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ఉన్నత పాఠశాలను ఆదివారం సందర్శించా రు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలన్నారు. సిలబస్ పూర్తి చేసి, రోజుకు ఒక సబ్జెక్టులో స్లిప్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులకు సైతం అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.


