
ప్రాజెక్టులకు కొనసాగుతున్న ఇన్‌ఫ్లో
జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రధాన ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. కుమురంభీం(అడ) ప్రాజెక్టుకు సోమవారం 52,220 క్యూసెక్కుల వరద వస్తుండగా ఆరు గేట్లు 4 మీటర్లు పైకెత్తి 52,220 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.872 టీఎంసీల నిల్వ ఉంది. అలాగే వట్టివాగు ప్రాజెక్టుకు 3,600 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, రెండు గేట్లు 0.9 మీటర్లు పైకెత్తి 3,250 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో గుండి, ఆసిఫాబాద్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దిగువన ఉన్న గుండి, రాజుర, రహపల్లి, చోర్‌పల్లి, చిలాటిగూడ, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు.