
మహనీయుల ఆశయ సాధనకు కృషి
ఆసిఫాబాద్: మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, గౌడసంఘాల నాయకులతో కలిసి సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు. పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహాయోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ సొంతంగా సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బహుజనుల కోసం పోరాడారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి సజీవన్, డీపీవో భిక్షపతిగౌడ్, గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, నాయకులు సుదర్శన్‌గౌడ్, రమేశ్, ప్రణయ్ పాల్గొన్నారు.
విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నా రు. మండలంలోని ఎల్లారం ప్రభుత్వ పాఠశాలను సోమవారం సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాల్సిన అవసరం ఉపాధ్యాయులపై ఉందన్నారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు.