
శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండొద్దు
దహెగాం(సిర్పూర్): వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండొద్దని సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. మండల కేంద్రంతోపాటు హత్తిని, ఐనం, పెసరికుంట గ్రా మాల్లో సోమవారం పర్యటించారు. వర్షానికి కూలిన హత్తినికి చెందిన లింగయ్య ఇంటితోపాటు మండల కేంద్రానికి చెందిన చిన్నక్కల ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఐనం సమీపంలోని లోలెవల్ వంతెనల వద్ద వరదతో దెబ్బతిన్న పంటల వివరాలను త హసీల్దార్ మునవార్ షరీఫ్‌ను అడిగి తెలుసుకున్నారు. పెసరికుంటలో పది కుటుంబాలకు చర్చిలో పునరావసం ఏర్పాటు చేశామని, వారిని అక్కడికి తరలించాలన్నారు. ఎంపీడీవో రాజేందర్, కార్యదర్శులు ఉన్నారు.