
కై రిగూడలో తీజ్ సంబరాలు
రెబ్బెన: మండలంలోని కై రిగూడలో బంజారా, లంబాడా ప్రజలు తీజ్ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలోని పెళ్లి కాని యువతులు గత 9 రోజులుగా అత్యంత నియమనిష్టతలతో తీజ్ బుట్టలకు నీళ్లు పోస్తూ పూజలు చేయగా ఆదివారం తీజ్ ఉత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని సేవాలాల్, జగదాంబ ఆలయంలో సాంప్రదాయ పూజలు నిర్వహించారు. తీజ్ బుట్టలను ఆలయం వద్ద నిలిపి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీజ్‌బుట్టలను వాగుల్లో నిమజ్జనం చేశారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్‌తో పాటు గ్రామ నాయక్ సుబ్బారావు, చౌహాన్ ఇందల్, కున్సోత్ రమేశ్, జరుపుల గణపతి, శంకర్, దారావత్ రవీందర్, గుడి పూజారి వసంత్‌రావు, వెంకట్రావ్, యువకులు వేడుకల్లో పాల్గొన్నారు.