
‘టీఎల్‌ఎం’ మేళాకు వేళాయె
కెరమెరి: విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చి ఆశించిన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులు కనీస అభ్యసనస్థాయి సాధించేలా కృత్యాధార బోధనకు బోధనాభ్యాసన సామగ్రి (టీఎల్‌ఎం – టీచర్ లెర్నింగ్ మెటీరియల్) దోహద పడుతోంది. ఈ సామగ్రిని సృజనాత్మకంగా రూపొందించి పాఠశాలల్లో అమలు పర్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనికోసం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఎల్‌ఎం మేళాల నిర్వహణకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం మండల స్థాయిలో, ఈనెల 20న జిల్లాస్థాయిలో మేళాలు నిర్వహించనున్నారు.
జిల్లాకు ఎంపిక..
ప్రతీ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు రూపొందించిన టీఎల్‌ఎంలను మండలస్థాయిలో నేడు ప్రదర్శించనున్నారు. ఎన్‌సీఆర్టీ సూచించిన మార్గదర్శకాల ఆధారంగా మండలస్థాయిలోని పది ఉత్తమ టీఎల్‌ఎంలను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. వీటిలో తెలుగు, ఆంగ్లం, గణితం, పరిసరాల విజ్ఞానం అంశాలలో రెండేసి, అన్నింటిలో కలిపి ఉత్తమంగా ఉన్న మరో రెండేసి చొప్పున ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు మండల స్థాయిలో ముగ్గురు స్థానిక విద్యానిపుణులతో కూడిన జ్యూరీని నియమిస్తారు. జిల్లాస్థాయిలో ఆరుగురు నిపుణుల జ్యూరీ ఎనిమిది ఉత్తమ టీఎల్‌ఎంలను రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేస్తుంది.
సులువుగా అర్థమయ్యేలా..
విద్యార్థులకు పాఠాలు సులువుగా అర్థమయ్యే వి ధంగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకుంటున్నా రు. ప్రత్యేకంగా టీఎల్‌ఎం ద్వారా విద్యా బోధన చే స్తున్నారు. తమ మేథస్సుతో ఎన్నో ఉపకరణాలు త యారుచేసి, పాఠ్య పుస్తకంలో ఉన్న పాఠ్యాంశం ఆ ధారంగా టీఎల్‌ఎం తయారు చేసి బోధన చేస్తున్నా రు. దీంతో విద్యార్థి సులువుగా పాఠాలను అర్థం చేసుకునే వీలు ఉంటుంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా పాఠశాలల్లో తొలిమెట్టు కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా టీఎల్‌ఎం విని యోగించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ప్ర స్తుతం పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు, వి ద్యార్థులు తయారు చేసిన టీఎల్‌ఎం గోడలకు అతి కించి కనిపిస్తున్నాయి. ఇందుకోసం గతంలో ఏటా ప్ర భుత్వం ప్రతీ పాఠశాలకు రూ.500 విడుదల చేసే ది. కానీ ప్రస్తుతం పాఠశాల నిధుల నుంచి టీఎల్‌ఎ ంకు వెచ్చించాలని అధికారులు పేర్కొంటున్నారు.
అభ్యసన సామర్థ్యాలు పెంపు
టీఎల్‌ఎం ఉపకరణాల ద్వారా విద్యార్థుల కనీస అ భ్యసన సామర్థ్యాలు పెంపొందించే అవకాశం ఉంటుంది. వినూత్న బోధనలతో విద్యార్థులను ఆకట్టుకోవచ్చు. నేడు మండల కేంద్రాల్లో నిర్వహించే టీఎల్‌ఎం మేళాకు ప్రాథమి క, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పక హాజరు కావాలి. టీఎల్‌ఎంలను ప్రదర్శించాలి. – ఉప్పులేటి శ్రీనివాస్,
అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్
జిల్లాలోని పాఠశాలల వివరాలు..

‘టీఎల్‌ఎం’ మేళాకు వేళాయె

‘టీఎల్‌ఎం’ మేళాకు వేళాయె