ఫిట్‌నెస్ లేని వాహనాలపై చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఫిట్‌నెస్ లేని బస్సులు న డుపుతున్న పాఠశాల యాజమాన్యాలపై చ ర్యలు తీసుకోవాలని శుక్రవారం ఆర్టీవో రాంచందర్‌కు జిల్లా కేంద్రంలో జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్ మాట్లాడారు. జిల్లాలో ప్రై వేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫిట్‌నెస్ లేని బస్సులు నడుపుతున్నారని తెలిపారు. వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీటింగ్ కెపాసిటికి మించి విద్యార్థులను వాహనాల్లో తీసుకువెళ్లకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సంఘం కన్వీనర్ మహేశ్ తదితరులున్నారు.


