ముగిసిన వేసవి క్రీడా శిక్షణ
ఆసిఫాబాద్‌రూరల్: క్రీడలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని డీఎస్వో మీనారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ ముగింపు కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గిరిజన సంక్షేమశాఖ అధ్యర్యంలో 15 రోజుల పాటు మంచి ర్యాల, ఆసిఫాబాద్ గిరిజన పాఠశాలల వి ద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించినట్లు తె లిపారు. వేసవి క్రీడా పోటీలకు 120 మంది క్రీడాకారులకు అఽథ్లెటిక్స్, హ్యాండ్‌బాల్, ఖో ఖో, వాలీబాల్, కబడ్డీ, చెస్ పోటీలపై శిక్షణ ఇ చ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అథ్లెటి క్స్ కోచ్ విద్యాసాగర్, కబడ్డీ కోచ్ తిరుమల్, హ్యాండ్‌బాల్ కోచ్ అరవింద్, పీడీ, పీఈటీలు లక్ష్మణ్, శ్రీను, రవీందర్ పాల్గొన్నారు.


