‘పేదల సంక్షేమమే ధ్యేయం’ | - | Sakshi
Sakshi News home page

‘పేదల సంక్షేమమే ధ్యేయం’

Apr 13 2025 12:18 AM | Updated on Apr 13 2025 12:18 AM

‘పేదల సంక్షేమమే ధ్యేయం’

‘పేదల సంక్షేమమే ధ్యేయం’

ఆసిఫాబాద్‌అర్బన్‌: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావ్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పార్టీ మండలా ధ్యక్షుడు చరణ్‌ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో ప్రధాన వీధుల గుండా నిర్వహించిన జైబాపు జైభీం, జై సంవిధాన్‌ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసే రాజ్యాంగాన్ని మార్చే పనిలో ఉందని ఆరోపించారు. సమాజంలోని పేద, మధ్య తరగతి వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజ్యాంగ రచన పూర్తయి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో దాని ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. ఐక్యంగా ముందుకు సాగి దాని నిజతత్వాన్ని అలాగే ఉండేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మైనార్టీ విభాగం అధ్యక్షుడు అసద్‌, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, నాయకులు మహ్మద్‌ ఇస్మాయిల్‌ (బబ్లూ) శివకుమార్‌, శైలేందర్‌, రాపర్తి కార్తిక్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement