
పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళి
ఆసిఫాబాద్‌అర్బన్: దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తెలంగాణ సాయుధ పోరాట రథసారధి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ఆదివారం జిల్లా కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో నిర్వహించా రు. ఈ సందర్భంగా ఏరియా కమిటీ నాయకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డివిజన్ కన్వీనర్ దినకర్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించి ఇంటి నుంచే పోరాటాన్ని ప్రారంభించారని తెలిపారు. భూస్వాముల కుటుంబంలో జన్మించిన ఆయన సుందర్ రాంరెడ్డి పేరును సుందరయ్యగా మార్చుకుని యావత్ ఆస్తిని పేదలకు పంచిపెట్టారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ సభ్యులు టీకానంద్, మాలశ్రీ, తిరుపతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.